ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల (israel hamas war seize fire) మధ్య 45 రోజులుగా జరుగుతోన్న యుద్ధానికి తాత్కాలిక ముగింపు లభించింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. తాజాగా కుదిరిన మానవతా సంధిని ఇజ్రాయెల్ స్వాగతించింది. 150 మంది పాలస్తీనియన్లకు కూడా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన క్యాబినెట్ గత రాత్రంతా సంధిపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చారు. కాల్పుల విరమణ, బందీల విడుదల నిర్ణయం కష్టమైనదే అయినా, ఇది సరైన నిర్ణయం అంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
నాలుగు రోజుల కాల్పుల విరమణ సంధిలో భాగంగా హమాస్… ఇజ్రాయెల్, ఇతర దేశాలకు చెందిన 50 మంది బందీలను విడుదల చేయనుంది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విడుదలైన ప్రతి పది మంది బందీలకు ఒకరోజు చొప్పున కాల్పుల విరమణ పెంచుకుంటూ పోనున్నారు. హమాస్ కూడా ఈ సంధికి అంగీకరించింది. ఇజ్రాయెల్ జైళ్ల నుంచి 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని హమాస్ ఆశాభావం వ్యక్తం చేసింది.