స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను సీఐడీ సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేస్తూ పిటీషన్ వేసింది. స్కిల్ డెవలప్మెంట్లో నిధులు మళ్లింపుపై సీఐడీ సరైన ఆధారాలు చూపకపోవడంతో చంద్రబాబుకు హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు రిమాండ్ విధించక ముందే తగిన ఆధారాలు సేకరించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. స్కిల్ స్కాం నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయనేందుకు ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్‌పై తీర్పు పెండింగులో ఉంది. తాజాగా సీఐడీ వేసిన పిటీషన్‌పై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.