BCCI ANNOUNCES INDIA SQUAD FOR T-20 SERIES WITH AUSTRALIA
భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 23న
మొదలవబోయే టీ-20 సీరీస్‌కు బీసీసీఐ మన దేశపు జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్
సంరంభం ముగిసిన కొద్దిరోజులకే పొట్టి క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా
తలపడుతున్నాయి.
ఐదు మ్యాచ్‌ల ఈ సీరీస్‌కి కెప్టెన్‌గా
సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు. హార్దిక్ పాండ్య గాయం కారణంగా అందుబాటులో
లేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్‌గా మొదటి మూడు మ్యాచ్‌లకు
రుతురాజ్ గైక్వాడ్, చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ ఉంటారు.
భారత జట్టులో వారు ముగ్గురితో పాటు ఇషాన్
కిషన్, యశస్వి జైపాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్,
అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ,
అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.
మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో నవంబర్ 23న
జరగనుంది. 26న కేరళ తిరువనంతపురంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. మూడవది గువాహటిలో 29వ
తేదీన ఆడతారు. డిసెంబర్1న రాయ్‌పూర్, డిసెంబర్ 3న బెంగళూరు నగరాల్లో చివరి రెండు
మ్యాచ్‌లూ జరుగుతాయి.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సేన
అద్భుత ప్రదర్శన చూపింది. ఆతిథ్య భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సీరీస్
గెలుచుకోవడం భారతదేశానికి తప్పనిసరిగా మారింది.