భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఏపీ పర్యటన ఖరారైంది. నవంబరు 22న పుట్టపర్తికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముర్ము పర్యటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
రేపు ఉదయం 12.30గం.లకు రాష్ట్రపతి ముర్ము బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు.