యెమెన్‌కు
చెందిన హౌతీ రెబల్స్ తమ దేశం నుంచి వెళుతున్న నౌకను హైజాక్ చేశారని ఇజ్రాయెల్
ఆరోపించింది. ఎర్ర సముద్రం వేదికగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆగ్రహం
వ్యక్తం చేసింది. ఈ ఘటన కారణంగా హమాస్‌తో సాగుతున్న వైరం మరింత పెరిగే అవకాశం
ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బల్గేరియా,
ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కియే నుంచి
భారత్‌కు వస్తున్న ఈ కార్గో నౌకను హౌతీ రెబల్స్ హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
హైజాక్‌కు
గురైన నౌకలో భారతీయులు, ఇజ్రాయెలీలెవరూ లేరని పేర్కొంది. బ్రిటీష్ కంపెనీకి
చెందిన ఈ నౌకను జపాన్ సంస్థ నిర్వహిస్తోందని,
ఇరాన్ మార్గదర్శకత్వంతో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని తెలిపింది.
కార్గోషిప్‌ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ రెబల్స్
అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నౌక ఇజ్రాయెల్‌కు
చెందింది కాకపోయినప్పటికీ ఆ దేశ
వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కు తాత్కాలిక యజమానిగా ఉన్నారు.