వరల్డ్ కప్ ఫైనల్లో భారత్కు భంగపాటు తప్పలేదు. కోట్లాది మంది క్రీడాభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారంనాడు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో (CWC Final) భారత జట్టు ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టు సునాయాసంగా గెలిచింది. ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచి ఆసీస్ క్రీడాకారులు రికార్డు నమోదు చేశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్లు 50 ఓవర్లకు 240 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 47, రాహుల్ 66, కోహ్లీ 54 పరుగులతో రాణించారు. ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం పరాజయానికి దారితీసింది. 241 పరుగుల లక్ష్యతో బరిలో దిగిన ఆసీస్ జట్టు మొదట్లో కొంత తడబడ్డా తరవాత నిలబడ్డారు. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టులో లబుషేన్ 58 పరుగులు,ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెడ్ 137 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాటింగ్ చేపట్టిన ప్రారంభంలో కొంత తడబడిందనే చెప్పాలి. 47 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఆ తరవాత ఆసీస్ ఆటగాళ్ల నిలకడగా స్కోరు పరుగులు తీయించారు. దీంతో 43 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు.