కీలక దశలో మూడు వికెట్లు నష్టపోవడంతో
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చాలా సహనంగా ఆడారు. ఏడు ఓవర్ల పాటు బౌండరీకి యత్నించకుండా సింగిల్స్
మాత్రమే తీశారు. ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా
ఆడారు. 20 ఓవర్లకు 115 పరుగులు చేశారు. తొలి పది ఓవర్లలో భారత్ స్కోరు 80/2గా
ఉంది.
26వ మొదటి బంతికి కోహ్లీ అర్ధ శతకం
పూర్తి చేశాడు. కోహ్లీ ఈ టోర్నీలో 5 హాప్ సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు.
కేఎల్ రాహుల్ 58 బంతులు ఆడి 28 పరుగులు చేశాడు. 27 వ ఓవర్ రెండో బంతిని బౌండరీ
బాదిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో తొలి ఫోర్ కొట్టాడు. దాదాపు గంట సమయం తర్వాత ఫోర్ షాట్
కొట్టడం విశేషం. 29వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ బోల్డ్ అయ్యాడు. పాట్ కమిన్స్ బంతిని
ఆడబోయే వికెట్ కోల్పోయాడు. 63 బంతులు ఆడి 54 పరుగులు వద్ద పెవిలియన్ చేరాడు.
నాలుగో వికెట్ కు 109 బంతులు ఆడిన కోహ్లీ-రాహుల్
87 పరుగులు చేశారు. 30 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులకు స్కోరు
చేరింది. కేఎల్ రాహుల్(42), రవీంద్ర జడేజా(1) ఆడుతున్నారు.