గడచిన రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పేరుమోసిన ఉగ్రవాదులు పదుల సంఖ్యలో హతమయ్యారు. భారత్‌కు మోస్ట్ వాంటెండ్‌గా (most wanted terrorits) ఉన్న ఉగ్రవాదులంతా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యారు. రెండేళ్లలో చనిపోయిన ఉగ్రవాదులకు లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ ఏ మహమూద్ ఉగ్రవాద ముఠాలకు చెందిన వారే కావడం విశేషం.
తాజాగా నవంబరు మొదటి పక్షంలోనే లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమూద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.వీరిలో ఒకరు లష్కర్ ఏ తోయిబా చీఫ్ మౌలాన్ మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడుగా తెలుస్తోంది.
2008 ముంబయిపై దాడికి ప్రణాళిక రచించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ 2021 లాహార్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయారు. మోటార్ సైకిళ్లపై వచ్చి ఉగ్రవాదులను అతి సమీపం నుంచి కాల్పి చంపారు. దుండగుల ఆచూకీ ఇంత వరకు పాక్ గుర్తించలేకపోయింది.
ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ వెనుక భారత్ ప్రోత్సహిస్తోన్న కిరాయి ముఠాలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. యూఏఈ కేంద్రంగా ఈ ఆపరేషన్ జరిపిస్తున్నారని కూడా పాక్ అనుమానిస్తోంది. అయితే ఇందుకు సరైన సాక్ష్యాలు మాత్రం వారి వద్ద లేవు.
దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పుడుతున్న వారి జాబితాను భారత్ పాక్‌కు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. పాక్‌లో ఉంటూ భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న మూడు సంస్థల ఉగ్రవాదులు పదుల సంఖ్యలో, గత రెండేళ్లుగా గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హతం కావడం చర్చనీయాంశంగా మారింది.
పాక్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని భారత్‌లో, ఉపఖండంలో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతోన్న ఉగ్ర సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. కొన్ని వర్గాల్లో వారికి లభిస్తోన్న మద్దతు, వారికి ఉన్న బలమైన ఆర్థిక మూలాల కారణంగా పాక్ ప్రభుత్వం కూడా వారిని అరెస్ట్ చేసే ధైర్యం చేయలేకపోతోందని తెలుస్తోంది.
భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించి పాక్‌లో బహిరంగంగా తిరుగుతున్నా ఆ దేశం వారిని అరెస్ట్ చేసి అప్పగించే ప్రయత్నం చేయడం లేదు. మీడియా కూడా వారిని చూపించే ప్రయత్నం చేయలేదు. నవంబరు 13న కరాచీలో జైష్ ఏ మహమూద్ చీఫ్ ప్రధాన అనుచరుడు మౌలానా రహీమ్ ఉల్లాహ తారిఖ్ ప్రార్థనల కోసం వెళుతుండగా దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
పాక్‌లోని బజాపూర్ ట్రైబల్ జిల్లాలో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ నియామకాలు చూసే అక్రమ్ ఖాన్ ఆలియాస్ అక్రమ్ ఘాజీని నవంబర్ 9న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ప్రార్థనలకు వెళుతున్న సమయంలోనే ఇతన్ని కూడా కాల్చి చంపారు.
నవంబరు 5న వాస్తవాధీన రేఖ వద్ద లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఖ్వాలా షాహిద్‌ను ముందుగా కిడ్నాప్ చేసి చంపేశారు.2018లో భారత సైన్యంపై జరిపిన దాడిలో ఇతనే కీలక సూత్రదారిగా ఉన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించాయి. 2016లో పఠాన్‌కోట్ ఉగ్రదాడికి పథక రచన చేసి అమలు పరిచిన లష్కర్ ఏ తోయిబాకు చెందిన షాహిద్ లతీఫ్‌ను కూడా మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు దుండగులు కాల్చి చంపారు. ఇలా పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతం కావడం వెనున భారత్ హస్తముందని పాక్ నమ్ముతోంది. కాని భారత్ కోరుతోన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేసి అప్పగించే ధైర్యం మాత్రం చేయలేకపోవడం గమనార్హం.