వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ(cwc-2023)లో భాగంగా జరుగుతున్న ఫైనల్
మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్
ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ
స్టేడియంలో ఈ తుది సమరం సాగుతోంది.
భారత్-పాకిస్తాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ కు
వాడిన పిచ్ నే ఫైనల్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నల్లరేగడితో చేసిన పిచ్,
బౌన్స్ తక్కువగా ఉండటంతో పాటు బంతి నెమ్మదిగా తిరిగే అవకాశం ఉంది.
ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచుల్లో ఛేదనకు
దిగిన జట్టే మూడుసార్లు నెగ్గింది.
భారత్ విజయం సాధిస్తే 1983, 2011 తర్వాత ప్రపంచకప్ చరిత్రలో స్వదేశంలో రెండుసార్లు
టోర్నమెంట్ గెలిచిన మొదటి దేశంగా భారత్ అవతరిస్తుంది.
మ్యాచ్ టై ఆయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు.
ఆ ఫలితం కూడా సమంగా ఉంటే విజేత తేలే వరకు సూపర్ ఓవర్లను కొనసాగిస్తారు.
ఈ టోర్నీలో ఫైనల్ విజేతకు ఐసీసీ, 40
లక్షల డాలర్లను ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. రూపాయల్లో అయితే దాదాపు రూ. 33 కోట్లు.
రన్నరప్ గా నిలిచిన జట్టుకు 20 లక్షల డాలర్లు, అంటే మన కరెన్సీలో రూ. 16.50 కోట్లు
దక్కనున్నాయి.