రాజస్థాన్
లోని ఛూరు పరిధిలో ఘోరం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు పోలీసులను రోడ్డు
ప్రమాదం పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నారు.
నాగౌరు
నుంచి జుంజును వెళుతున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఈ ఘటన
చోటుచేసుకుంది.
ఎన్నికల విధుల బందోబస్తు కోసం వీరంతా వెళుతుండగా సుజన్‌గర్ పోలీస్
స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
ఖిన్వ్‌సర్ పోలీస్ స్టేషన్ నుండి ఏడుగురు పోలీసు అధికారులు
జుంజునులో ప్రధాని మోడీ హాజరవుతున్న ర్యాలీలో బందోబస్తు విధుల కోసం వెళుతుండగా, కనుటాకు సమీపంలో అతివేగంతో వచ్చిన ట్రక్కు వారి వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో పోలీసు వాహనం నుజ్జునుజ్జుకావడంతో పాటు అందులోని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
ఉదయం 5:30 – 6 గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.