వన్డే
క్రికెట్ వరల్డ్ కప్ (CWC-2023)టోర్నీ కాసేపట్లో
ప్రారంభకాబోతుంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ (FINAL)ను వీక్షించేందుకు ప్రపంచ క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం ఇప్పటికే క్రికెట్ అభిమానలతో
కిటకిటలాడుతోంది.
టైటిల్ పోరు చూసేందుకు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ బిగ్ స్క్రీన్
లు ఏర్పాటు చేశారు.
భారత్,
ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు నరేంద్ర మోదీ
స్టేడియానికి కాసేపట్లో చేరుకోనున్నారు.
స్వదేశంలో
జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఓటమి లేకుండా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఫైనల్
గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ
స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ మ్యాచుల్లో భారత్ ఇప్పటి వరకు ఓడిపోలేదు. 1987 లో
జింబాబ్వే పై ఏడు వికెట్ల తేడా తో గెలిచింది. ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగించాలని
రోహిత్ సేన చూస్తోంది.
గ్రౌండ్లో ఇప్పటి వరకు 18 వన్డేలు ఆడిన భారత్ 10
మ్యాచుల్లో విజయం సాధించింది.
ఈ రోజు వర్షం పడే సూచనలు ఏమీ లేవని వాతావరణ
శాఖ భరోసా ఇచ్చింది. వాతావరణం ప్రశాంతంగా
ఉండటంతో పాటూ ఉష్ణోగ్రత 32 డిగ్రీల మేర ఉండొచ్చని తెలిపింది.
లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప
ప్రధాని రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,
తమిళనాడు, అసోం సీఎంలు, ఇతర ప్రముఖులు ఈ మెగా ఫైనల్కు హాజరవుతున్నారు. దీంతో
గుజరాత్ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ
ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది.
.