ప్రపంచ అందాల భామల పోటీలు ముగిశాయి. 2023 సంవత్సరానికి జరిగిన పోటీల్లో మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటాన్ని నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ దక్కించుకుంది. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని ఆమెకు అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా విశ్వసుందరి షెన్నిస్ పలాసియోస్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన 72వ పోటీల్లో 84 దేశాలకు చెందిన భామలు పోటీ పడ్డారు. మన దేశం తరపున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పొల్గొన్నారు.