భారత్, ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ (ODI Finals) కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రపంచ కప్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రోటాక్ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
2011లో భారత్ చివరి సారిగా వరల్డ్ కప్ గెలుచుకుంది. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నాను. అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మేము రాత్రంతా మ్యాచ్ గురించి చర్చిస్తూనే ఉన్నాం. మ్యాచ్ ముందు రోజు మేము నిద్ర పోలేదని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన తరవాత చాలా కాలం ఆనందంగా గడిపినట్లు గుప్తా తెలిపారు.ఇవాళ మా ఫైనాన్స్ టీంతో మాట్లాడాను, భారత్ క్రికెట్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని గుప్తా ప్రకటన చేశారు.