భారత
జాతి గర్వించదగిన ధీరుడు, ప్రతీ భారతీయుడికీ తన కర్తవ్యాన్నీ
గుర్తు చేసే ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలోచనా ధృక్పథం నేటి తరానికీ స్ఫూర్తినీయం.
మొఘల్
సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి, హిందూ రాజ్య వెలుగుల్ని విస్తరింపజేసిన వీరుడి స్మరణ,
నేటి యువతరం గుండెల్లో పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి.
హిందూ
పదపాద్ షాహి ఛత్రపతి శివాజీ 350వ
పట్టాభిషేకం సంవత్సరం సందర్భంగా ఆయన జీతంలోని ప్రేరణదాయకమైన ఘట్టాలను నాటక రూపంలో
విజయవాడలో ప్రదర్శించారు. .
సంస్కార
భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి
విజయవాడ వారిచే తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
సంస్కార
భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ స్వీయ రచనా
దర్శకత్వంలో ఈ ప్రేరణాత్మక ఘట్టాన్ని ప్రదర్శించారు. నయనానందకరమైన నృత్యాలతో
‘‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’’ నాటకాన్ని ఆహుతల్ని అలరించడంతో పాటు దేశభక్తీని
మేల్కొలిపింది.
శివాజీ
మహారాజ్ జీవితంలో పలు సంఘటనలు, యుద్ధనీతి, రాజ్యపాలన తదితర అంశాలను నాటకంలో అద్భుతంగా
ప్రదర్శించారు.
తారాగణం నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురించారు. ఇలాంటి నాటక
ప్రదర్శనలతో భారతజాతి కీర్తి మరింత ద్విగుణీకృతం చేస్తుందన్నారు. సనాతన ధర్మం
మరింతగా వర్ధిల్లేందుకు శివాజీ జీవితచరిత్ర స్ఫూరిదాయకంగా నిలుస్తుందని
కొనియాడారు.