రాష్ట్రంలో
అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు వైసీపీ ప్రభుత్వ దోపిడీకి అద్దం పడుతున్నాయని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
ఆరోపించారు.
ఇసుక
దోపిడీ ద్వారా వచ్చే సొమ్ము అంతా తాడేపల్లికి వెళుతోందని ఆరోపించారు.
దోచుకో
దాచుకో అన్న చందంగా ప్రభుత్వ ఇసుక విధానం ఉందని వైసీపీ పాలనను తూర్పారబట్టారు.
తూర్పుగోదావరి
జిల్లాలో పర్యటించిన పురందరేశ్వరి, కడియం మండలం బుర్రిలంక రేపు వద్ద జరుగుతున్న
ఇసుక అక్రమ తవ్వకాలు పరిశీలించారు.
స్థానిక బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆమె రేవు
వద్దకు వెళ్ళి పరిశీలించారు.
ఇసుక
అక్రమ తరలింపు గురించి స్థానిక నర్సరీ రైతులు బీజేపీ, జనసేన నేతలకు వివరించారు.
గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదని వారు ఆవేదన చెందారు. ప్రశ్నిస్తే చంపేస్తామని
బెదిరించారని వాపోయారు.
జేపీ
సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన
బీజేపీ ఏపీ చీఫ్, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.