రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము ఈనెల 22న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వస్తున్నారు. సత్యసాయి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొని
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రాష్ట్రపతి
పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
భారత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22న మధ్యాహ్నం12.30 గంటలకు బెంగుళూరు నుంచి భారత
వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి
ప్రశాంతి నిలయానికి చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవంలో
పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు.
పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి వచ్చే
మార్గంలో రోడ్లకు ఇరువైపులా ఆహ్వానం పలికే ఆర్చ్ లు, హోర్డింగులు ఏర్పాటు అంశాలపై పలు సూచనలు చేశారు.