బీజేపీని
వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతికి(Vijayashanti) ఆ పార్టీ కీలక పదవి అప్పగించింది. ప్రచార,
ప్లానింగ్ కమిటీలో స్థానం కల్పించిన అతిపురాతన రాజకీయ పార్టీ, ప్రచార కమిటీకి చీఫ్
కో ఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ హోదాలు కల్పించింది.
బీజేపీ(BJP) నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి
అడుగుపెట్టిన విజయశాంతి, ఆ తర్వాత పలు పార్టీల్లో చేరారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీని
స్థాపించిన రాములమ్మ, 2009లో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అనంతరం 2014లో కాంగ్రెస్
లో చేరారు. కొన్నాళ్ల పాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత
2020లో బీజేపీలో చేరారు.
ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
చేతుల మీదుగా హస్తం కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్
పార్టీయే ప్రత్యామ్నాయమన్న రాములమ్మ, కేసీఆర్ ను ఫాంహౌస్‌కు పరిమితం చేయడమే
లక్ష్యగా కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.