హరిహర
సుతుడైన శ్రీ అయ్యప్పస్వామి కొలువైన శబరిమలకు భక్తులు పోటెత్తారు. అత్యంత పవిత్రమైన
మళయాళ మాసం వృశ్చికం ప్రారంభం కావడంతో శుక్రవారం
తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయ తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శబరిమలేశుడి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా
పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారులు తరలివచ్చారు.
కేరళ
దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్, తిరువాన్కూర్
దేవస్థానం బోర్డు నూతన అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, మణికంఠుడిని దర్శించుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులకు
ఈసారి ఆలయ ప్రాంగణంలో సరికొత్త అనుభూతి దక్కుతుంది. ఆలయ ముఖద్వారం వద్ద రాతి
స్తంభాలు ఏర్పాటు చేసి శిలలు చెక్కారు. అలాగే వాటిపై స్వామియే శరణం అయ్యప్ప అని
రాశారు.
అలాగే
హైడ్రాలిక్ రూఫ్ కూడా నిర్మిస్తున్నారు.
వర్షం లేని సమయంలో దీనిని
మడతపెట్టుకోవచ్చు. డిసెంబర్ 27న మండల దీక్షా సమయం ముగియనుంది. తిరిగి మకరసంక్రమణం
రోజైన డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 15 వరకు దర్శనాలు కొనసాగుతాయి.
తెలుగు
రాష్ట్రాల నుంచి ఆర్టీసు బస్సులు శబరిమలకు నడుస్తున్నాయి. దీంతో పాటు దక్షిణ మధ్య
రైల్వే ఆధ్వర్యంలో పలు ట్రెయిన్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి.