జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir) కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో
ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు, లష్కర్ తోయిబాకు చెందినవారిగా అధికారులు
గుర్తించారు.
సామ్నో ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి
ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు
కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం కూడా ప్రతిగా కాల్పులు జరిపింది. శుక్రవారం
తెల్లవారుజామున కూడా కాల్పులు జరిగాయి. మొత్తం 18 గంటలపాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు
ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు పూంచ్ జిల్లాలో అనుమానాస్పద
కదలికలు కనిపించడంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే తనిఖీలు ముమ్మరం
చేసింది..