డీప్‌ఫేక్
వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. సాంకేతికతను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్ వీడియోలు
సృష్టించడం తీవ్ర ఆందోళనకరమని ఆయన ఆవేదన చెందారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో
మాట్లాడిన ప్రధాని, ఇటీవల చోటుచేసుకున్న డీప్‌ఫేక్ ఘటనలపై స్పందించారు.
సాంకేతికత
కారణంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం, వాటి నుంచి అప్రమత్తంగా ఉండటంపై అందరికీ
అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని ఫ్లాగ్
చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీని కోరినట్లు చెప్పారు.
ఇటీవల
తాను ఓ పాట పాడినట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని దానిని తెలిసిన వాళ్ళు తనకు
పంపారన్నారు.
పలువురు
నటీమణులకు చెందిన డీఫ్ ఫేక్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై
స్పందించిన కేంద్ర ప్రభుత్వం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఫిర్యాదు అందిన 36 గంటల
లోపు తొలగించాలని మార్గదర్శకాలు జారీచేసింది. కంప్యూటర్ రిసోర్సు , మరేదైనా పరికరం
ఉపయోగించి మోసాలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా
విధిస్తామని హెచ్చరించింది.