భారత్ వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ (CWC-2023) ఫైనల్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మాదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో నవంబర్ 19న జరిగే మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య జరిగే రసవత్తర పోరును చూసేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖలు వెళ్ళనున్నారు.
చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్ ను అస్వాదించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవ్వనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అంతోనిని కూడా ఆహ్వానించారు.
మరో హైలెట్ ఏంటంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతుంది. ఫైనల్ ఆరంభమయ్యే పది నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు క్రీడాభిమానులను మరింత అలరించనున్నాయి. తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల విన్యాసాలతోతో అబ్బురపరుచనున్నాయి. ఇందుకోసం నేడు, రేపు ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో పాప్ సింగర్ దువా లిపా తో ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియా లో ఓ పోస్టు వైరల్ చక్కర్లు కొడుతోంది.