కేంద్రప్రభుత్వం అందిస్తున్న
నిధులతోనే రాష్ట్రప్రభుత్వం పథకాలు అమలు చేయగల్గుతుందని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి
పురందేశ్వరి అన్నారు. నెల్లూరు లో పర్యటిస్తున్న పురందరేశ్వరి, వైసీపీ ప్రభుత్వ
విధానాలను తప్పుబట్టారు.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని
ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని
గాలికొదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల కూడా
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
పనులు చేసిన కాంట్రాక్టర్లకు
బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు
పడుతున్నారని అన్నారు. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని
ఎద్దేవా చేశారు.