ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 7వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది.
రెగ్యులర్, బ్యాక్లాగ్ ఖాళీలతో కలిపి మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు చివరి ఏడాది చదివే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నాటికి వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంది.
పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు.
బేసిక్ వేతనం రూ. 19,900 నుంచి మొదలు అవుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 6 మాసాల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మత సంబంధిత మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఆన్లైన్లో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు.