ఏపీలో ఎస్ఐ పోస్టుల భర్తీపై వివాదం నిరుద్యోగులకు అశనిపాతంలా తయారైంది. ఎస్ఐ నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును (ap highcourt) ఆశ్రయించారు. ఎత్తు విషయంలో అభ్యర్థులకు అన్యాయం చేశారని, గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ఎలా ప్రకటిస్తారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఎస్ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
ఎస్ఐ అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని న్యాయమూర్తి పోలీసు నియామక బోర్డును ప్రశ్నించింది. ఎస్ఐ నియామకాలను నిలిపివేయాలని అభ్యర్థుల తరపు న్యాయవాది కోరగా… అందుకు కోర్టు అంగీకరిస్తూ స్టే విధించింది.