తెలంగాణలో
అధికారమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకు పోతున్న ఆ రాష్ట్ర బీజేపీ శాఖ,
వినూత్నంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అగ్రనేతలతో ఓ దఫా ప్రచారాన్ని పూర్తి
చేసిన కాషాయ పార్టీ, మేనిఫెస్టో రూపకల్పనలోనూ మిగతా పార్టీలకంటే ముందువరుసలో ఉంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రజాకర్షక పథకాలను
ఎన్నికల హామీలుగా ఎంచుకుంది.
తాజా
గా ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకు ఇంధ్రదనస్సుగా నామకరణం చేసింది. దీనిని
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలోని
అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా దీనిని రూపొందించారు.
పాలక బీఆర్ఎస్, ప్రతిపక్ష
కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బీజేపీ ఇంద్ర ధనస్సు ఉండనుంది. ఇందులో ఏడు ముఖ్య
హామీలు ఉంటాయి.
ఉద్యోగాల
కల్పన, రైతులు, మహిళల ఓట్లే లక్ష్యంగా
ఎన్నికల వాగ్దానాలు చేస్తున్న కాషాయ నేతలు,
స్థానిక నగరాల పేరు మార్పు అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్
పాలనలో మోసపోయిన యువతకు మంచి భవిష్యత్ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు
తీసుకుంటామని నేతలు పునరుద్ఘాటిస్తున్నారు. ఇక రైతుల సంక్షేమం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు వివరించడంతో
పాటు అధికారంలోకి వస్తే మరింతగా రాష్ట్ర
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి నమూనాతో
అన్నదాతలకు భరోసా ఉంటుందని వివరిస్తున్నారు.
వరికి
కనీస మద్దతు ధర రూ.3,100కు పెంచడం ద్వారా సాగుదారులకు మేలు జరుగుతుందంటున్నారు.
ఆయుష్మాన్
భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిమితిని పది లక్షలకు పెంచాలని భావిస్తోంది.
వివాహితకు ఏటా రూ. 12 వేలతో పాటు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా హామీ
ఇవ్వబోతుంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 20 వేల సాయం అందించనుంది.
యూపీఎస్సీ
తరహాలో టీఎస్పీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో విద్యా సంస్థల
ఏర్పాటు, పీఎమ్ ఆవాస్ యోజన కింద అర్హులకు ఇళ్ళ వంటి హామీలు మేనిఫెస్టోలో చేర్చారు.