బంగాళాఖాతంలో
ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాసేపట్లో తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ
అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం
విశాఖపట్నానికి తూర్పు, ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాకు 190 కిలోమీటర్లు,
పశ్చిమబెంగాల్ కు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఉత్తర-ఈశాన్య దిశగా
ప్రయాణిస్తూ కాసేపట్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ తుఫానుకు మాల్దీవులు మిధిలి అని పేరుపెట్టింది.
తుఫాను రేపటికి మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపుపార-మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండీ
ప్రకటించింది.
వాయుగుండం తీరం దాటిన తర్వాత ఈ నెల చివరికి ఈశాన్య రుతుపవనాలు బలం
పుంజుకుని రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తద్వారా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ
శాఖ అంచనా వేస్తోంది.