మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్లోని (Madyapradesh Polling) మొత్తం 220 అసెంబ్లీ స్థానాలకు, చత్తీస్గఢ్లో రెండో విడత 70 నియోజకవర్గాలకు ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9 గంటల సమయానికి మధ్యప్రదేశ్లో 10.39 శాతం, చత్తీస్గఢ్లో 5.71 శాతం పోలింగ్ నమోదైంది.
ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సతీమణి సాధనా సింగ్, వారి ఇద్దరు కుమారులు ఉదయాన్నే ఓటు వేశారు. ముందుగా స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం సీఎం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం కమల్ నాథ్ కూడా చింద్వాడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ వర్గియా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రవేశ్లో భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.