తిరుచానూరు
శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు
శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు.
మంగళవాయిద్యాలు, కళా ప్రదర్శనలు, వేద పారాయణాల నడుమ అమ్మవారు తిరువీధుల్లో
విహరించారు.
అమ్మవారి
దర్శనంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం వంటి ఫలాలను ప్రసాదిస్తుందని భక్తులు
విశ్వసిస్తారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ మండపంలో అమ్మవారి ఉష్ణపన తిరుమంజనం
నిర్వహించారు.
రాత్రికి
శ్రీపద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించనున్నారు.
తిరుమలలో
భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నేడు స్వామి దర్శనం కోసం భక్తులు 26
కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది. బుధవారం నాడు తిరుమలేశుడిని 71, 123 మంది
భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా రూ.3.84 కోట్ల ఆదాయం లభించింది.