తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, 608 మంది నామినేషన్లు
వేసి ఉపసంహరించుకున్నట్లు ప్రధాన ఎన్నికల
అధికారి తెలిపారు.
బీఆర్ఎస్
అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి 44 మంది పోటీలో ఉండగా, మరో
స్థానమైన కామారెడ్డి నుంచి 39 మంది బరిలో
ఉన్నారు.
కేసీఆర్
ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండటంతో ఆయన ఓటమే లక్ష్యంగా పలువురు
నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక
అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేసిన నియోజవకర్గంగా ఎల్బీ నగర్ రికార్డ్ క్రియేట్
చేసింది. ఇక్కడి నుంచి 48 మంది శాసనసభకు పోటీ చేస్తున్నారు. బాన్సువాడ, నారాయణపేట
నుంచి అత్యధికంగా కేవలం ఏడుగురు మాత్రమే నామినేషన్ వేశారు.
తెలంగాణ
లో 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు. స్త్రీ, పురుషుల ఓట్లు సమానంగా ఉన్నారు.
శేరిలింగంపల్లి
నియోజకవర్గంలో అత్యధికంగా 7.32 లక్షల ఓటర్లు ఉండగా, భద్రాచలంలో అత్యల్పంగా 1.49
లక్షల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
మొత్తం
119 నియోజకవర్గాలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి
ఫలితాలు వెల్లడిస్తారు.