తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర,
ఒడిశా తీరాల వెంబడి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రెండు
రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన
వాయుగుండం మరింత బలపడి వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, ఒడిశాకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం
వెల్లడించింది.
ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తీవ్ర వాయుగుండం
కదులుతున్నట్లు ప్రకటించింది. 18న ఉదయం నాటికి బంగ్లాదేశ్‌లోని ఖేపుపార-మొంగ్లా మధ్య తీరం దాటే
అవకాశం ఉంది.