వన్డే
క్రికెట్ వరల్డ్ కప్(cwc-2023) టోర్నీలో విజయభేరీ మోగిస్తున్న భారత జట్టు తీరును
ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆడిన ప్రతీమ్యాచ్ లో గెలుస్తూ ఫైనల్ కు దూసుకెళ్ళిన
రోహిత్ సేనను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. సెమీఫైనల్ లో కివీస్ ను మట్టికరిపించి
ఫైనల్ కు దూసుకెళ్ళిన భారత జట్టు పోరాటపటిమకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయ్యారు.
సెమీస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా
అభినందించారు.
వన్డేల్లో
50వ సెంచరీ చేసి రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, అత్యుత్తమ క్రీడాకారుడని
కొనియాడారు. క్రీడాస్ఫూర్తికి, పట్టుదలకు ఉదాహరణంగా నిలిచాడన్నారు. ప్రపంచ ఘనత
సాధించడం అతని అంకిత భావానికి నిదర్శనమన్నారు. బౌలింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన
షమీకీ అభినందనలు తెలిపారు. షమీ చాలా బాగా ఆడాడని, ఆయనను భవిష్యత్ తరాలు
ఆదరిస్తాయన్నారు.