ట్రిపుల్ఐటీ విద్యార్థులను పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలోని (Idupualapya IIIT) హాస్టల్లోకి కొండచిలువ ప్రవేశించింది.బాలుర హాస్టల్- 2లో విద్యార్థుల మంచాల కింద కొండచిలువను గుర్తించారు. విద్యార్థులు భయంలో పరుగులు తీశారు.
కొండచిలువ దూరిన విషయాన్ని హాస్టల్ విద్యార్థులు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువను గొనెసంచిలో బంధించారు. తరవాత అక్కడ నుంచి తరలించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.