వన్డే వరల్డ్ కప్ టోర్నీ(CWC-2023)లో భాగంగా lనేటి మధ్యాహ్నం
జరుగుతున్న రెండో సెమీఫైనల్(SECOND SEMIFINAL) లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (South Africa V Australia
)జట్లు తలపడనున్నాయి. గతంలో నాలుగుసార్లు సఫారీ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించినప్పటికీ ఫైనల్కు చేరలేకపోయింది. ఐదో ప్రయత్నంలోనైనానా ఫైనల్ కు అర్హత సాధించాలనే కసితో ఈసారి బరిలోకి
దిగుతుంది.
ప్రస్తుత
టోర్నీలో సఫారీ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ప్రత్యర్థులపై ఐదుసార్లు 300
పైచిలుకు స్కోర్లను సునాయాసంగా సాధించింది.
ఓపెనర్ డికాక్, డుస్సెస్, మార్ క్రమ్, క్లాసెస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు.
బౌలింగ్ లో రబాడ, ఎంగిడి, కేశవ్, కొట్జీ మ్యాచ్ విన్నర్లుగా మారారు.
ఈ వరల్డ్
కప్ టోర్నీలో వరుసుగా రెండు ఓటములతో మొదలైన ఆసీస్ ప్రస్థానం, ఈ తర్వాత ఏడు
విజయాలతో సాగుతోంది. బౌలింగ్ లో స్టార్క్, హాజెల్ వుడ్, జంపా, మ్యాక్సీ
రాణిస్తున్నారు.
ఈడెన్
గార్డెన్స్ వికెట్ పై నిలదొక్కుకొంటేనే బ్యాటింగ్ చేయగలరు. ఆటకు వర్షం అంతరాయం
కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వర్షం
పడితే రిజర్వ్ డే కొనసాగుతుంది. ఒక వేళ మళ్లీ అంతరాయం ఏర్పడితే రన్ రేట్ ఎక్కువగా
ఉన్న సౌత్ ఆఫ్రికా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.