సంచలనం సృష్టించిన న్యూస్ క్లిక్ ఉగ్ర మూలాల (News Clic Terror Case) కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఈ కేసులో అక్రమంగా నిధులు అందించారనే ఆరోపణలపై ఈడీ అమెరికాకు చెందిన మిలియనీర్ నైవెల్లీ రాయ్ సింగమ్కు సమన్లు జారీ చేసింది. చైనా భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు నివెల్లీ రాయ్ సింగమ్ నిధులు ఖర్చు చేస్తున్నాడని ముందుగా అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.
చైనాలో నివాసం ఉంటోన్న సింగమ్కు విదేశాంగ శాఖ ద్వారా ఈడీ సమన్లు పంపించింది. న్యూస్ క్లిక్ ద్వారా చైనా అనుకూల భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సింగమ్ అక్రమ మార్గాల్లో నిధులు సమకూర్చాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను సింగమ్ ఖండించారు.
గత నెలలో పోలీసులు, ఎన్ఐఏ చేసిన దాడుల్లో న్యూస్ క్లిక్ చీఫ్ ఎడిటర్ సహా పలువురు ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయాలో సోదాలు నిర్వహించారు. విచారణలో మొదటి సారిగా సింగమ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో న్యూస్ క్లిక్ చీఫ్ ఎడిటర్ ప్రబిర్ పురకాయస్థను అరెస్ట్ చేశారు. మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిని కూడా పోలీసులు గత నెల అదుపులోకి తీసుకున్నారు.