వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC-2023) టోర్నీలో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. సెమీ ఫైనల్ లో
న్యూజీలాండ్ జట్టును 70 పరుగులు తేడాతో ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. వరుసగా
పదో విజయాన్ని కైవసం చేసుకుని ధీమాగా
ఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది.
భారత్ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో
బరిలోకి దిగిన న్యూజీలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ కీలక
వికెట్లు తీసి మ్యాచ్ చరిత్రను మార్చేశాడు.
డారిల్ మిషెల్ (119 బంతుల్లో 134) సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) పోరాడారు.
భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో
చరిత్ర సృష్టించగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
ఒక దశలో కివీస్‌కు చేజింగ్ పెద్ద కష్టం కాదు అనిపించినా.. షమీ
తన అద్వితీయ బౌలింగ్‌తో న్యూజీలాండ్‌ను ఇంటి బాట పట్టించాడు. షమీకి ‘మ్యాన్ ఆఫ్
ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు (17 ఇన్నింగ్స్‌ల్లో) తీసిన బౌలర్‌గా
షమీ ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ ఫైనల్ చేరడం భారత్‌కు ఇది నాలుగోసారి. 1983, 2003,
2011లో
తుదిపోరుకు అర్హత సాధించింది. అందులో రెండుసార్లు (1983, 2011లో) విశ్వ విజేతగా నిలిచింది.
నేడు రెండో సెమీఫైనల్లో
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.. ఈ మ్యాచ్ విజేతతో ఆదివారం భారత జట్టు
ఆడనుంది.