వన్డే
క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ సెమీఫైనల్ టోర్నీలో భాగంగా భారత్, న్యూజీలాండ్ తలపడుతున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా
జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్, బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో
397 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు నష్టపోయిన రోహిత్ సేన మెరుపు ఇన్నింగ్స్
ఆడింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్
గిల్ 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 47 పరుగులకు చేర్చారు. సౌతీ వేసిన 8.2 బంతికి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి క్యాచ్ ఔట్ గా
వెనుదిరిగాడు. 71 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే
సరికి ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు సాధించారు. 13.3 బంతికి గిల్ హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు 41 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
కండరాలు
పట్టేయడంతో శుభమన్ గిల్ 79 పరుగుల వద్ద మైదానం వీడాడు. అతడి స్థానంలో శ్రేయస్
అయ్యర్ బ్యాటింగ్ కు దిగాడు.
25
ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 178 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 29 ఓవర్లకు 203 పరుగులు చేసింది.
ప్రపంచకప్
లో కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఒక ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు(674*) చేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
గతంలో సచిన పేరిట ఈ రికార్డు ఉండేది. 2003 టోర్నీలో సచిన్ 673 పరుగులు చేశారు.
శ్రేయస్
అయ్యర్ 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ టోర్నీల్లో వరుసగా నాలుగుసార్లు 50 కంటే
ఎక్కువ పరుగులు చేశాడు. 37 ఓవర్లకు 270 పరుగులు చేసింది. 40 ఓవర్లకు 287 పరుగులు చేశారు.
కోహ్లీ
106 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. వన్డే లో 50 వ సెంచరీ చేసి
ప్రపంచఘనత కైవసం చేసుకున్నాడు. 42 ఓవర్లలో 11 పరుగులు రాగా స్కోర్ బోర్డు 303కి
చేరింది.
సౌతీ
వేసిన 43.6 కోహ్లీ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. కాన్వేకు క్యాచ్ 117 పరుగుల వద్ద
పెవిలియన్ చేరాడు. 327 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
శ్రేయస్
అయ్యర్ కూడా మెరపు ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేసి క్యాచ్ ఔట్ గా
వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 48.5 బంతికి
క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఆతర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక్క
పరుగు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 49.1 బంతికి నాలుగు వికెట్లు నష్టపోయి 382 పరుగులు
చేసింది. రిటైర్ట్ హట్ గా మైదానం వీడిన గిల్ చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగా
మళ్ళీ క్రీజులోకి వచ్చాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు నాలుగు వికెట్లు
నష్టపోయి 397 పరుగులు చేసింది.
శుభమన్ గిల్ (80), కేఎల్ రాహుల్ (39) అజేయంగా
నిలిచారు.
కివీస్
బౌలర్లలో సౌతీ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.