వన్డే
క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్, న్యూజీలాండ్ మధ్య జరగుతున్న మ్యాచులో
పలు రికార్డులు నమోదు అయ్యాయి. కోహ్లీ 106 బంతుల్లో శతకం కొట్టి తన కెరీయర్ లో 50వ
సెంచరీ నమోదు చేశాడు. వన్డే లో 50 వ సెంచరీ చేసి ప్రపంచఘనత సాధించాడు.
వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల
రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఈ విషయంపై స్పందించిన సచిన్ తన రికార్డును
భారతీయుడే అధిగమించాలని ఆకాంక్షించారు. 41.4
బంతిని ఆడి శతకం పూర్తి చేశాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ 50వ
శతకాన్ని నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ లో 8 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేసి
రికార్డు క్రియేట్ చేశాడు.
50వ సెంచరీ
చేసిన కోహ్లీకి స్టేడియంలోనే ఉన్న అతని భార్య నాలుగు ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వగా
కోహ్లీ కూడా స్పందించి రిప్లై కిస్ ఇచ్చాడు. కోహ్లీ సాధించిన ఘనతను సచిన్ సహా ఇతర
మాజీ, ప్రస్తుత క్రీడాకారులు చప్పట్లతో మెచ్చుకున్నారు. 117 పరుగుల వద్ద
పెవిలియన్ చేరాడు.