వన్డే
క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ సెమీఫైనల్ టోర్నీలో భాగంగా భారత్, న్యూజీలాండ్
తలపడుతున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన
భారత్, బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ లో ఏకంగా పది పరుగులు రాబట్టారు. రెండో
ఓవర్ లో 8, మూడులో 7, నాలుగులో 13, ఐదులో 9 పరుగులు రాబట్టారు. దీంతో 5 ఓవర్లు ముగిసే
సరికి భారత్ స్కోరు 47 పరుగులకు చేరింది.
సౌతీ వేసిన 8.2 బంతికి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి క్యాచ్ ఔట్ గా
వెనుదిరిగాడు. 71 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
రోహిత్
శర్మ మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు
బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్
సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్
చరిత్రకెక్కాడు.
15
ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు సాధించారు. 13.3 బంతికి గిల్ హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు 41 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
కండరాలు
పట్టేయడంతో శుభమన్ గిల్ 79 పరుగుల వద్ద మైదానం వీడాడు. అతడి స్థానంలో శ్రేయస్
అయ్యర్ బ్యాటింగ్ కు దిగాడు.
25 ఓవర్లు ముగిసే సమాయానికి భారత్ జట్టు 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 29 ఓవర్లకు 203 పరుగులు చేయగా, కోహ్లీ, శ్రేయస్
ఆడుతున్నారు.