బంగాళాఖాతంలో
ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ఉదయం విశాఖకు ఆగ్నేయంగా, ఒడిశా పారాదీప్
కు ఆగ్నేయగంగా, బెంగాల్‌కు దక్షిణంగా
కేంద్రీకృతమైంది. రేపటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది.
దీని
ప్రభావంతో రాష్ట్రంలో(RAIN
ALERT) అక్కడక్కడా
వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని
సూచించారు.
48 గంటల పాటు సముద్రతీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలివీచే
అవకాశం ఉందని ప్రకటనలో తెలిపింది. గడిచిన
24 గంటల్లో దక్షిణ కోస్తాతో పాటు తమిళనాడులో వానలు కురిశాయి.