ఇంటర్నెట్ ప్రపంచంలో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను (world’s fastest internet) చైనా ప్రారంభించింది. దీని ద్వారా సెనకులో 150 సినిమాలను సమానమైన డేటాను బదిలీ చేసుకునే వేగం అందుబాటులోకి వచ్చింది. సెనకును 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేసే వేగంతో చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ ఈ ఇంటర్నెట్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న నెట్ వేగం కంటే ఇది పది రెట్లు ఎక్కువని హువాయ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ తెలిపారు.
సింఘువా విశ్వవిద్యాలయం, సర్నెట్ కార్పొరేషన్ సహకారంతో హువాయ్ టెక్నాలజీస్ ఇంటర్నెట్ వేగాన్ని పది రెట్లు పెంచేలా పరిశోధనలు చేసి విజయం సాధించారు.
బీజింగ్ సహా ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన ఇంటర్నెట్ కోసం చైనా ప్రభుత్వం 3 వేల కి.మీ నెట్వర్క్ ఏర్పాటు చేసింది. ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ లైన్ విజయవంతం కావడంతో దీన్ని మరింత విస్తరించనున్నారు.