జమ్మూ(Jammu)లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో
వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది(bus
fell into a gorge). ఈ దారుణ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు
300 అడుగుల లోయలోపడటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ లోని డోడా జిల్లా బటోత్ –కిప్త్వాడ్ జాతీయ
రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు
ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని అధికారులు
చెబుతున్నారు.
క్షతగాత్రులను
కిష్త్వాడ్, డోడాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ దళాలు, మృతదేహాలను
బయటకు తీశాయి.
సహాయ చర్యల కోసం హెలికాప్టర్ సర్వీసును వినియోగిస్తున్నట్లు
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని
సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.