భారత
జాతి గర్వించ దగిన నేతల్లో అమరవీరుడు బిర్సాముండా (Birsa Munda )ఒకరని ఆంధ్రప్రదేశ్ బీజేపీ(AP BJP) నేతలు కొనియాడారు. గిరిజనుల భూ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు,
త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
విజయవాడ
బీజీపీ రాష్ట్ర కార్యాలయంలో బిర్సాముండా
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైనార్టీ
మోర్చా జాతీయ నాయకురాలు డాక్టర్ జాఫ్రిన్ మహే జబీన్, బిర్సాముండాకు అంజలి
ఘటించారు. అనంతరం మాట్లాడుతూ, బిర్సా ముండా తక్కువ కాలమే జీవించినా ఆయన అందించిన సేవలు
ఎప్పటికీ మరవలేమన్నారు.
జాతి ప్రయోజనాల కోసం రాజీ లేకుండా పోరాడారని గుర్తు
చేసుకున్నారు.
అడవి
బిడ్డల భూమి హక్కుల కోసం, బ్రిటీషర్లకు
వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు.బిర్సాముండా
గుర్తుగా జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు
చేసిన ఘనత ఆనాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
షేక్ బాజీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
దేవానంద్, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు
అడ్డూరి శ్రీరాం, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి సయ్యద్ బాషా, కార్యదర్శి యాస్మిన్, సుబ్బయ్య, మాదల రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.