‘సనాతన
ధర్మాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా మతమార్పిడి ముఠాలు చెలరేగుతున్నాయి. హిందువుల
మనోభావాలు దెబ్బతీయడంతో పాటు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయి. అడ్డుఅదుపు
లేకుండా వ్యవహరిస్తూ పవిత్ర హిందూ క్షేత్రాల వద్ద కూడా అన్యమత ప్రచారానికి
దిగుతున్నారు.
తాజాగా
చిత్తూరు జిల్లా కార్వేటిలో కొలువైన శ్రీవేణుగోపాల స్వామి ఆలయ పుష్కరిణివేదికగా
అన్యమతస్తులు రెచ్చిపోయారు. టీటీడీ పరిధిలోని ఈ ఆలయ పుష్కరిణిలో కొందరి చేత స్నానాలు చేయించి అక్కడే మత
మార్పిడికి యత్నించారు. స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో
అక్కడి నుంచి వెళ్లిపోయారు .
బీజేపీ
నేతల ఫిర్యాదు మేరకు పాస్టర్ ఇమ్మానుయేల్, అతడి కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరిపై
కేసు నమోదు చేశారు. కార్వేటి నగర చర్చి నిర్వాహకులు కొంతమందికి బాప్టిజం
ఇచ్చినట్లు అందిన సమాచారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఘటనపై టీటీడీ కూడా పోలీసులకు
ఫిర్యాదు చేసింది.
మతమార్పిడి
వ్యవహారంపై బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత
వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్థానికులతో కలిసి
పుష్కరిణిని సందర్శించారు. కార్తీకమాసంలో అందులోనూ టీటీడీ అనుబంధ ఆలయం ప్రాంగణంలో
మతమార్పిడులకు పాల్పడటం దారుణమన్నారు.హిందూ ఆలయాల దగ్గర అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంలో
పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.