మాల్దీవులకు కాబోయే అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జా (Maldives President) గత వారం భారత దళాలు తమ దేశం వీడాలని పిలుపునిచ్చారు. భారత దళాలను ఖాళీ చేయించి మాల్దీవులు చైనా సైన్యాన్ని ఆహ్వానిస్తుందని అందరూ ఊహించారు. దీనిపై మొయిజ్జా ప్రకటన చేశారు. భారత బలగాలను ఖాళీ చేయించిన తరవాత చైనా సైన్యాన్ని ఆహ్వానించే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు.
మాల్దీవులు భౌగోళికంగా రాజకీయ శత్రుత్వంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో మొహమద్ ముయిజ్జా చెప్పారు. సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో ముయిజ్జా విజయం సాధించారు. అధికారంలోకి రాగానే భారత బలగాలను ఖాళీ చేయిస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ మేరకు భారత బలగాలు ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. అన్ని దేశాలతో కలసి పనిచేయబోతున్నాం అంటూ కాబోయే అధ్యక్షుడు ముయిజ్జా రాజధాని మాలేలో చెప్పారు. మాల్దీవులకు కాబోయే అధ్యక్షుడు ముయిజ్జా చైనా అనుకూల వ్యక్తి అని మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రకటించారు.
గృహనిర్మాణ మంత్రిగా పనిచేసిన సమయంలో ముయిజ్జు చైనా సహకారంతో 7 వేల అపార్ట్మెంట్లు, మాలే సమీపంలో విమానాశ్రమం, దానిని కలిపే భారీ వంతెనను నిర్మించారు. ముయిజ్జు మల్దీవుల అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేయనుండటంతో అక్కడ చైనా ప్రభావం పెరిగిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.