Harbhajan serious on Injamam Ul Haq comments of his
conversion
ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్
సింగ్ (Harbhajan Singh), పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్హక్ (Injamam
Ul Haq) తననుద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డాడు. తాను మతం మారడానికి
సిద్ధంగా ఉన్నట్లుగా హక్ చెప్పడంపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
కొద్దిరోజుల క్రితం ఇంజమాముల్హక్ ఒక ఇంటర్వ్యూ
ఇచ్చాడు. అందులో, మౌలానా తారిక్ జమీల్ అనే వ్యక్తి వాగ్ధాటికి ముగ్ధుడై, హర్భజన్
సింగ్ మతం మారతాను (Religious Conversion) అన్నాడని హక్ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో
ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది.
‘‘మాకు ప్రార్థనలు చేసుకోడానికి ఒక గది ఉండేది.
ప్రతీరోజూ సాయంత్రం మౌలానా తారిక్ జమీల్ (Maulana Tariq Jameel) అక్కడికి
వచ్చి మాతో నమాజ్ చేయించేవారు. కొన్నిరోజుల తర్వాత ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్,
జహీర్ ఖాన్ కూడా రావడం మొదలుపెట్టారు. ఇంకో నలుగురు ఇండియన్ క్రికెటర్లు కూడా
అక్కడ కూచుని మమ్మల్ని చూసేవారు. వాళ్ళలో హర్భజన్ కూడా ఉన్నాడు. తారిక్ జమీల్,
మౌలానా అని అతనికి తెలియదు. కానీ అతన్ని చూసి తాను ముగ్ధుడిని అయిపోయాననీ, అతని
బోధలను అనుసరించాలనుకుంటున్నాననీ చెప్పాడు’’ అని ఇంజమామ్ ఆ ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చాడు.
ఇంజమామ్ వ్యాఖ్యలపై హర్భజన్ సింగ్ నిప్పులు
చెరిగాడు. ‘‘అతను ఏ మందు కొట్టి మాట్లాడుతున్నాడో. నేను భారతీయుడనని గర్వపడతా.
నేను సిక్కునని గర్వంగా చెప్పుకుంటా. ఈ సోదిగాళ్ళు నోటికొచ్చిందల్లా
వాగుతున్నారు’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసాడు.
కొద్దిరోజుల క్రితమే పాకిస్తాన్ క్రికెట్
బోర్డుకూ, చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్కూ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి.
హక్ మీదున్న వేరే ఆరోపణల నేపథ్యంలో అతని రాజీనామాను పీసీబీ గతవారమే ఆమోదించింది.
‘‘ఇంజమాముల్హక్ రాజీనామాను పాకిస్తాన్ క్రికెట్
బోర్డ్ ఆమోదించింది. నేషనల్ మెన్స్ సెలక్షన్ కమిటీ, జూనియర్ సెలక్షన్ కమిటీల
చైర్మన్‌గా తన పదవులకు హక్ రాజీనామా చేసాడు. హక్ స్థానంలో కొత్తవారి నియామకం
త్వరలో జరుగుతుంది. హక్ స్వచ్ఛందంగానే తన పదవికి అక్టోబర్ 30న రాజీనామా చేసాడు.
అతనిమీద ఉన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆరోపణల మీద విచారణ పారదర్శకంగా
జరగడానికే ఆ నిర్ణయం తీసుకున్నాడు’’ అని పీసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.