బాలీవుడ్
నటి, మాజీ విశ్వసుందరీ ఐశ్వర్య
రాయ్ బచ్చన్(Aishwarya Rai) పై
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్
రజాక్(Abdul Razzaq) అనుచిత వ్యాఖ్యలు(Controversial Comment) చేశాడు.
దీనిపై స్వదేశంతో
పాటు భారత్ సహా ఐశ్వర్య
అభిమానులు తప్పుబట్టారు. రజాక్ మాటలను ఖండించారు. చవకబారు
వ్యాఖ్యలంటూ దుమ్మెత్తిపోయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని
డిమాండ్ చేశారు.
వెల్లువెత్తుతున్న
విమర్శలతో తప్పును సరిదిద్దుకునేందుకు రజాక్ ప్రయత్నించాడు.
పోరపాటున నోరుజారీ
అనవసరంగా ఐశ్యర్య పేరును తీసుకొచ్చానని చెప్పారు. ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు
చెబుతున్నట్లు ప్రకటించారు. ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదని అనుకోకుండా
నోరు జారానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
వరల్డ్కప్
టోర్నీలో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన, భారత్ చేతిలో చిత్తుగా ఓటమితో ఆ దేశ మాజీ
క్రికెటర్లు భారత్ పై ఎదో ఒక రకంగా అక్కసు వెళ్ళగక్కుతున్నారు. పాకిస్తాన్ జట్టు ఓటమిపై
జరుగుతున్న డిబేట్ లో పాల్గొన్న అబ్దుల్ రజాక్, క్రికెట్ తో సంబంధం లేని ఐశ్వర్య
పేరును చర్చలోకి లాగి అనుచితంగా మాట్లాడాడు.
పాకిస్తాన్
క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుబడుతూ ‘‘ ఐశ్వర్యను తాను పెళ్ళి చేసుకుంటే అందమైన,
పవిత్రమైన పిల్లలు పుడతారనుకోవడం పొరబడినట్లే’’ నని అన్నారు.
రజాక్ మాటలు హద్దులు
దాటడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా పాకిస్తాన్ క్రికెటర్ల
సంస్కారం అంటూ దెప్పిపొడిచారు. స్త్రీల
పట్ల అలా మాట్లాడటం సిగ్గు చేటు అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్చలోరజాక్
తో పాటు అఫ్రిది, గుల్ కూడా పాల్గొన్నారు. ఆఖరికి క్షమాపణలు చెప్పి వివాదానికి
ముగింపు పలికారు.