ప్రముఖ సినీ నటి నమిత భర్త, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగం అధ్యక్ష పదవిలో జరిగిన మోసం కేసులో చౌదరి సహా మరో ఇద్దరికి
సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు జారీ చేసింది. చిన్నతరహా పరిశ్రమల కౌన్సిల్ అధ్యక్ష పదవి ఇప్పిస్తానంటూ నమిత (namita) భర్త చౌదరి, గోపాల్‌స్వామి అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ పదవికి ఇటీవల నమిత భర్త చౌదరి నియమితుడయ్యాడు. తాను మోసపోయాయని గోపాల్‌స్వామి కేసు పెట్టారు.
ఈ కేసులో ముత్తురామన్‌తో పాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్వంత్ యాదవ్‌ను గత నెల అరెస్ట్ చేశారు. తాజాగా కౌన్సిల్ అధ్యక్షుడు చౌదరి, తమిళనాడు బీజేపీ మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాధ్, చౌదరి సహాయకుడు ముత్తురామన్ విచారణకు హాజరు కావాలని గతంలొనే సమన్లు జారీ చేశారు. అయితే చౌదరి, మంజునాథ్ హాజరు కాలేదు. విచారణను సేలం నగర సెంట్రల్ క్రైం బ్రాంచికి బదిలీ చేశారు.