వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC-2023) టోర్నీలో భాగంగా మధ్యాహ్నం
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తొలి సెమీఫైనల్(Semifinal) జరగనుంది. భారీ అంచనాల మధ్య భారత్, న్యూజీలాండ్ జట్లు( BHARAT
VS New
Zealand ) తలపడనున్నాయి. గత మ్యాచ్‌ల రికార్డుల దృష్ట్యా టాస్ గెలిచిన
జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఐసీసీ
ఈవెంట్లలో ఇప్పటివరకు భారత్, న్యూజీలాండ్ 13 సార్లు
తలపడగా… కివీస్‌దే పైచేయిగా ఉంది. ఆ జట్టు 9 మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ విషయంపై
స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit
Sharma), గత వరల్డ్‌కప్‌లో న్యూజీలాండ్ చేతిలో
భారత్ ఓడిందన్న విషయాన్ని మరిచిపోవాలని అన్నాడు. గత ఐదేళ్లలో ఏం జరిగింది? గత పదేళ్లలో ఏం జరిగింది? గత వరల్డ్ కప్ లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతం, అప్రస్తుతం అని
స్పష్టం చేశాడు.
ఇప్పటివరకు జరిగిన 12 వన్డే వరల్డ్ కప్
టోర్నీలలో భారత్ జట్టు ఏడుసార్లు సెమీఫైనల్ చేరుకుంది. 1983,
1987, 2003, 2011, 2015, 2019 లో ఆడి మూడుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓడింది.
1983 వరల్డ్‌కప్ లో కపిల్ దేవ్
నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తర్వాత ఫైనల్ లో వెస్టిండీస్ కు ఊహించని షాక్
ఇచ్చి జగజ్జేతగా అవతరించింది.
1987
ఎడిషన్ లో మాత్రం భారత్ సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా ఇంగ్లండ్ చేతిలో
ఓడి సెమిస్ దశలోనే వెనుదిరిగింది.
1992
వరల్డ్ కప్ లోను సేమ్ సీన్ రిపీట్ అయింది. అప్పడు భారత జట్టు కెప్టెన్ గా మహమ్మద్
అజారుద్దీన్ వ్యవహరించారు.
ఇక 1996 సెమీఫైనల్
లో చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు శ్రీలంక చేతిలో ఊహించని పరాభవం
ఎదురైంది.
అభిమానుల అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. శ్రీలంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించే
క్రమంలో భారత్ 34 ఓవర్ల వద్ద 120/8 స్కోరుతో కొనసాగుతున్న సమయంలో..
స్టేడియంలోని ఫ్యాన్స్ హంగామా చేశారు. దీంతో ఆట ముందుకు సాగలేదు. ఈ క్రమంలో శ్రీలంకను
అంపైర్లు విజేతగా ప్రకటించారు.
వన్డే వరల్డ్ కప్ టోర్నీ 2003 లో
భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెంది రన్నరప్‌తో
పెట్టుకుంది. ఇక 2011 టోర్నీల మహేంద్ర సింగ్ ధోని
నేతృత్వంలోని జట్టు భారత్ ను రెండోసారి జగజ్జేతగా నిలిపింది.
2019 లో వర్షం కారణంగా రెండు రోజులపాటు
జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. నాటి మ్యాచ్‌లో ఫినిషర్ ధోని
రన్ అవుట్ రనౌట్ కావడం విజయావకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడింది.