శ్రీశైలం శైవ క్షేత్రంలో అన్యమతస్తుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. హిందూ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా 13 మంది ముస్లింలకు శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో (srisailam temple) దుకాణాలు కేటాయించడం వివాదానికి దారితీసింది. తాజాగా ముస్లింలకు 13 దుకాణాలు కేటాయిస్తూ దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్మోహన్రెడ్డి (cm ys jaganmohanreddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
దేవస్థానాల్లో అన్యమతస్తులకు దుకాణాలు కేటాయించడంపై హిందువులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భక్తులపై అనేసార్లు దాడులు జరిగినా స్పందించడం లేదు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ పరిధిలోని మొత్తం 24 షాపుల్లో 13 దుకాణాలు ముస్లింలకు కేటాయించారు. ఇక్బాల్, జిలానీ, బాషా, రబ్బీని, జమీల్ అహ్మద్, ఎస్ఎం బాష, మహమూద్ అలీ, జాఫర్ బీ, రెహ్మతుల్లా, నూర్జహాన్ బీ, మాలిక్, మహ్మద్ రఫీ, నైమద్, ఎండీ రఫీలకు శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో షాపుల కేటాయింపు వ్యవహారం ఇప్పడు వివాదాస్పదంగా మారింది.
శ్రీశైల క్షేత్రంలో ముస్లింలకు 150 గృహాలు కేటాయించారు. తాజాగా షాపులు కేటాయించారు. హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోన్న దేవాదాయశాఖ తీరుపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి.శ్రీశైలం దేవస్థానం ప్రాగణంలో దుకాణాలపై తమకు హక్కు ఉందంటూ ముస్లింలు లక్షలు ఖర్చు చేసి కోర్టులకు వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు. దేవాలయాలు ప్రభుత్వ కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.