పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు (terrorist shotdead) వరుసగా హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడు రహీమ్ ఉల్లా తారిఖ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రార్థనలకు హాజరయ్యేందుకు వెళుతుండగా తారిఖ్‌ను కొందరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపారు. వరుసగా ఉగ్రవాదులు హతమవడంపై పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
జైషే ఉగ్రవాదుల ముఠాల మధ్య అంతర్గత పోరు కారణంగానే తారిఖ్ హత్య జరిగిందని సమాచారం అందుతోంది. పాక్ ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. కరాచీలో అతిపెద్ద మురికివాడ ఓరంగి టౌన్‌లో తారిఖ్‌ను కాల్చి చంపారు. ఘటనా స్థలంలోనే తారిఖ్ ప్రాణాలు కోల్పోయాడు. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్ట్‌లో అగ్రభాగాన ఉన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు తారిఖ్ అంత్యంత సన్నిహితుడు.
పాక్‌లో గడచిన నాలుగు మాసాల కాలంలో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నెలలోనే ఇది మూడో ఘటన. తారిఖ్ హత్యను పోలీసులు ఖండించారు. ఇది టార్గెట్ హత్యని నిర్థారించారు. వరుస హత్యలతో చాలా మంది ఉగ్రవాదులు రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది.